![]() |
![]() |

ఫామిలీ స్టార్స్ లేటెస్ట్ ఎపిసోడ్ చూస్తే చాలా హార్ట్ టచింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీక్ వచ్చిన ఆర్టిస్టుల్లో ఇద్దరికీ సుధీర్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాడు అని చెప్పేసరికి సుధీర్ తో పాటు ఆడియన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అందులో మొదటి వ్యక్తి ఆచంట మహేష్ . రంగస్థలం మూవీలో చేసిన క్యారెక్టర్ తో అలాగే మహానటిలో చేసిన రోల్స్ తో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అలా రంగస్థలం మహేష్ గా మారిపోయాడు. కొంతకాలం జబర్దస్త్ లో కూడా చేసాడు.
అలాంటి మహేష్ ఈ వీక్ ఫామిలీ స్టార్స్ ఎపిసోడ్ కి వచ్చాడు. ఇక ఇందులో తాను పడిన స్ట్రగుల్స్ ఏంటి అని సుధీర్ అడిగాడు. "మా ఆవిడ బి టెక్ చేసింది. నాకు ఎప్పుడూ సపోర్ట్ గా ఉండేది. టెన్షన్ పడకు అని చెప్పేది. లైఫ్ లాంగ్ సపోర్ట్ గా ఉంటాను అని చెప్పేది. మరదలు కావడం వలన ఏంటో తెలీదు కానీ పెళ్ళికి ముందే కష్టాలు కానీ పెళ్లి తర్వాత కష్టాలే లేవు . " అని చెప్పాడు. "అంత మంచి వైఫ్ ని పెట్టుకుని సోషల్ మీడియాలో ఏదో ట్రెండింగ్ నడుస్తోంది ఏంటి " అని సుధీర్ అడిగాడు.
"నిజానికి నేను డివోర్స్ అనే సిరీస్ చేసాను. ఐతే యు ట్యూబ్ వాళ్లంతా కూడా నాకు డివోర్స్ ఐపోయినట్టుగా వేసేసారు. అన్నయ్య నీలో నాకు నచ్చింది ఏంటంటే డైలీ నువ్వు షూటింగ్ పొద్దున్న వెళ్ళేటప్పుడు ఎం చేసేవాడివంటే అమ్మ కాళ్లకు నమస్కారం పెట్టి వెళ్ళేవాడివి. నువ్వు నమ్మవన్నా ఆరోజు నుంచి ఈ రోజు వరకు మా అమ్మ కాళ్లకు దణ్ణం పెట్టడం మానలేదు అన్నా. నిజానికి ఆ మంచితనం అమ్మ కాళ్లకు దణ్ణం పెట్టే అలవాటు నిన్ను చూసే నేర్చుకున్నాను" అని చెప్పాడు మహేష్. దాంతో సుధీర్ థాంక్యూ సో మచ్ అని చెప్పాడు.
![]() |
![]() |